మొక్కలు నాటిన జిల్లా జడ్జి వీరయ్య | - | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటిన జిల్లా జడ్జి వీరయ్య

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

మంచిర్యాలక్రైం: స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుని మనగడకు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతీ ఇంట్లో రెండు మొక్కలు ఉండేలా చూడాలని తెలిపారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కే.నిరోషా, క్రిష్ణతేజ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, ఎండీ.సందాని, రాములు, రామ్‌రెడ్డి, మల్లారెడ్డి, తిరుపతి, కోర్టు ఏఓ సూర్యకాంత్‌, ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement