లక్సెట్టిపేట: ఫెర్టిలైజర్ దుకాణాదారులు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేసిన రైతులకు రశీదు ఇవ్వాలని, స్టాక్ బోర్డు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. యూరియా బుకింగ్ యాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఏడీఏ కృష్ణ, తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఏవో శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


