మంచిర్యాలఅర్బన్: జిల్లా విద్యాశాఖాధికారిగా లలిత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డీఈవో యాదయ్య బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లడంతో ఆమెకు అదనపు బాధ్యత(ఎఫ్‌ఏసీ)లు అప్పగించారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఉపాధ్యాయల సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
మంచిర్యాలఅర్బన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీఈవో లలిత సూచించారు. శుక్రవారం 20206–27 విద్య సంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశాల్లో గుడిరేవుకు చెందిన విద్యార్థిని బొమ్మన ఆద్విక చక్కని ప్రతిభ కనబరిచి ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు ఎంపికై ంది. విద్యార్థినిని డీఈవో అభినందించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు భరత్, విజయలక్ష్మీ, సత్తయ్య, కృష్ణమూర్తి, రాజ్‌కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చన్న పాల్గొన్నారు.


