ఇందిరమ్మ ఇంటి కోసం ట్యాంకెక్కి నిరసన | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇంటి కోసం ట్యాంకెక్కి నిరసన

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

జన్నారం: జన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా తొలగించారని ఆరోపిస్తూ కట్టెకోల రాము శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని నీళ్ల ట్యాంకెక్కి నిరసన వ్యక్తం చేశాడు. హామీ ఇవ్వకుంటే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మిరా నందునాయక్‌, సర్పంచ్‌ కళావతి, పలువురు నాయకులు అక్కడికి చేరుకుని సముదాయించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని హామీనివ్వడంతో కిందికి దిగాడు. ఇందిరమ్మ ఇల్లు, డ్రైనేజీల నిర్మాణం, పింఛన్‌పై డిమాండ్‌ చేశాడు. సర్పంచ్‌ కళావతి ఇల్లు మంజూరుతోపాటు డ్రైనేజీ నిర్మాణం చేయిస్తానని, పింఛన్‌ గురించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement
 
Advertisement
Advertisement