తానూరు: మండలంలోని ఎల్వి గ్రామ సర్పంచ్ ఇర్వంత్ తన కుమారుడిని సర్కారు బడిలో చేర్పించారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుండడంతో ప్రజలకు నమ్మకం కలిగించేందుకు తన కుమారుడిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులతో విద్యా బోధన ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బడిబాటలో భాగంగా తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను ప్రభత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయులు సుధాకర్, శంకర్, శివకుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


