పర్యావరణాన్ని పరిరక్షించుదాం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని పరిరక్షించుదాం

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

మంచిర్యాలటౌన్‌: పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన పోస్టర్లు, బ్యానర్లు విడుదల చేసిన అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వర్షాకాలంలో చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి, పర్యావరణ పరిరక్షణలో వైద్యులు, సిబ్బంది భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, అసంక్రమణ వ్యాధుల కోఆర్డినేటర్‌ కాకిరాల వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, శ్రీనివాస్‌, పద్మ, వసుమతి, రవికిరణ్‌, సురేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement