ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

కోటపల్లి: ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని కోట పల్లి సీఐ కృష్ణ అన్నారు. మండలంలోని శంకరా పూర్‌ గ్రామంలో శుక్రవారం కోటపల్లి పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రతీ ఇంటిని తనిఖీ చేసి 2లీటర్ల గుడుంబాతోపాటు సరైన పత్రాలు లేని 30వాహనాలు సీజ్‌ చేశారు. సీఐ కృష్ణ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులకు లేదా 100డయల్‌కు స మాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ జగన్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement