ఎకై ్సజ్‌ శాఖలో ఇద్దరికి పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ శాఖలో ఇద్దరికి పదోన్నతి

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

ఆదిలాబాద్‌టౌన్‌: ఉమ్మడి జిల్లాలోని ఎకై ్సజ్‌ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్‌గా పదోన్నతి లభించింది. శుక్రవారం ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ కొమ్రేవార్‌ అరుణ్‌కుమార్‌ను నిజామాబాద్‌ జిల్లాకు కేటాయించారు. మంచిర్యాలలో పనిచేస్తున్న తిరుపతికి అక్కడే సూపరింటెండెంట్‌గా పదోన్నతి లభించింది. కాగా టీఎన్‌జీఓ సంఘ భవనంలో అరుణ్‌కుమార్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నవిన్‌ కుమార్‌, రాజేశ్వర్‌, నితిన్‌కుమార్‌, సోహెల్‌ మిర్జా, ప్రసాద్‌, నర్సిములు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement