పాతమంచిర్యాల: ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ అన్నారు. శుశ్రవారం జిల్లా కేంద్రంలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో శ్రీఆర్యవర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు తమ సంస్థలో 20 ఉద్యోగాల భరీ కోసం జాబ్‌మేళా నిర్వహించారు. 29 మంది హాజరు కాగా 12మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆరుగురికి ఉద్యోగ నియామక లేఖలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీఆర్యవర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.


