మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాపల్ ప్రాంతానికి చెందిన మారం రామకృష్ణ(46) వడదెబ్బతో మృతిచెందాడు. యాపల్ ప్రాంతంలో ఆయన గత కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. రెండ్రోజులుగా స్వంత పనులపై ఎండలో తిరిగాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో మంచంపై విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బావమరిది సంపత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. రామకృష్ణ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతోపాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు సందర్శించి అంత్యక్రియలు నిర్వహించారు.


