సైబర్‌ వలలో రిటైర్డ్‌ ఆర్మీ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ వలలో రిటైర్డ్‌ ఆర్మీ

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని బాలాజీ గార్డెన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ ఆర్మీ పిట్ల నవీన్‌ కుమార్‌ సైబర్‌ వలలో చిక్కుకున్నాడు. ఏప్రిల్‌ 27న తన మొబైల్‌ ఫోన్‌కు లింక్‌ రాగా, దానిని ఓపెన్‌ చేశాడు. నా లుగు సార్లు అకౌంట్లో ఉన్న డబ్బులు రూ.35వేలు, రూ.15వేలు, రూ.40వేలు, రూ.9వేలు మొత్తం రూ.99వేలు కోల్పోయాడు. దీంతో మరుసటి రోజు బాధితుడు సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.

పీజీఈసెట్‌లో సత్తాచాటిన సాయిప్రీతమ్‌

మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణ పీజీఈసెట్‌లో శుక్రవారం జెఎన్‌టీయూ విడుదల చేసిన ఫలితాల్లో మంచిర్యాలకు చెందిన అయిత సాయిప్రీతమ్‌ సత్తాచాటాడు. 90శాతం మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. సాయిప్రీతమ్‌ స్థానిక కార్మెల్‌లో పదో తరగతి, అల్ఫోర్స్‌లో ఇంటర్మీడియెట్‌, హైదరాబాద్‌ వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి కళాశాలలో ఇన్‌స్ట్రుమెంటర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. పీజీ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చాటాడు.

‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

మంచిర్యాలఅర్బన్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఫస్ట్‌ లాంగ్వేజ్‌(తెలుగు, ఉర్దూ, హిందీ) పరీక్షలకు 78 మందికి గాను 49 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్‌ మల్లేశం సందర్శించారు. మొదటి రోజు పరీక్ష సజావుగా జరిగిందని డీఈవో ఎల్‌.లలిత తెలిపారు.

నేర పరిశోధనపై శిక్షణ అవసరం

మంచిర్యాలక్రైం: నేర పరిశోధనలో పోలీస్‌ అఽధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ అన్నారు. కమిషనరేట్‌ ఆవరణలో శుక్రవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సాంకేతికతపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు నమోదు చేసిన తర్వాత వాటి దర్యాప్తులో నైపుణ్యతను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేర పరిశోధన లక్ష్యంగా టెక్‌టీమ్‌, వర్టికల్‌ ఆంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్టికల్‌ ఇన్‌చార్జి సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌, సీఐలు రంజిత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement