ఇచ్చోడ: మండలంలోని ముఖరా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షికి శుక్రవారం ప్రపంచ పర్యావరణ ది నోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా అవార్డు ప్రదానం చేశారు. గతంలో సర్పంచ్‌గా ఉన్న కాలంలో గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం, అవెన్యూప్లాంటేషన్, హరితవనం, బృహత్ పార్కులలో మొక్కలు నా టడడం, ప్రతీ మొక్కను కాపాడి, డిజిటల్ ట్రీ ఆధార్ గుర్తింపు తేవడంతో అవార్డు అందుకున్నట్లు ఆమె తెలిపారు. ఎస్పీ అఖిల్‌మహాజన్, డీఎఫ్‌వో ప్రశాంత్‌బాజీరావు పాటిల్ ఉన్నారు.


