నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

మందమర్రిరూరల్‌: కారులో తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై నరేశ్‌తో కలిసి సీఐ రమేశ్‌ ఈమేరకు వివరాలు వెల్లడించారు. తమకందిన పక్కాసమాచారంతో మందమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధి రామన్‌కాలనీ సమీపంలో వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేపట్టారు. స్విఫ్ట్‌ డిజైర్‌ కారును తనిఖీ చేయగా 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. శ్రీపతినగర్‌కు చెందిన మహ్మద్‌ సాహెబ్‌జానీ, మహ్మద్‌ అఫ్రోజ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీటిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. భైంసాకు చెందిన అబ్దుల్‌ రజాక్‌ వద్ద పత్తి విత్తనాలు కేజీ రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేసి స్థానికంగా రూ.2500 కేజీ చొప్పున అమ్మడానికి సిద్ధపడ్డారు. కారుతోపాటు విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల గుట్టును రట్టు చేసిన ఎస్సైతోపాటు సిబ్బందిని సీఐ రమేశ్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement