అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికులు | - | Sakshi
Sakshi News home page

అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికులు

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలకేంద్రానికి చెందిన జిల్లా జీవ వైవిధ్య కోఆర్డినేటర్‌ సోన్‌కాంబ్లే గోపినాథ్‌, కేస్లాపూర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ మెస్రం నాగ్‌నాథ్‌లు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అడవుల సంరక్షణకు కృషి చేయడంతో పాటు జీవవైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నందుకు గుర్తింపు వచ్చిందని జిల్లా జీవ వైవిధ్య కోఆర్డినేటర్‌ సోన్‌కాంబ్లే గోపినాథ్‌ తెలిపారు. నాగోబా ఆలయ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్ల రక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేసినందుకు అవార్డు వచ్చినట్లు కేస్లాపూర్‌ సర్పంచ్‌ మెస్రం తుకారం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement