గంజాయి కట్టడికి కృషి | - | Sakshi
Sakshi News home page

గంజాయి కట్టడికి కృషి

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

● డీసీపీ బాస్కర్‌

● డీసీపీ బాస్కర్‌

కాసిపేట: గంజాయి వినియోగం, క్రయవిక్రయాల కట్టడికి కృషి చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాసిపేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ ఆవరణ, రికార్డులు, రిసెప్షన్‌ కౌంటర్‌, కేసుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు అదుపులోనే ఉన్నాయని, జాతీయ రహదారి, దేవాపూర్‌ కంపెనీ, కాసిపేట గనులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నివారణకు పోలీస్‌శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ వినియోగించాలని, ట్రిపుల్‌ రైడింగ్‌ చేయరాదని అన్నారు. డివిజన్‌ స్థాయిలో గంజాయి నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని, 150మంది అనుమానితులను గుర్తించామని తెలిపారు. గ్రామ పోలీస్‌ అధికారులను నియమించి వారానికి రెండుసార్లు గ్రామాల్లో పర్యటిస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌, మందమర్రి సీఐ పర్స రమేష్‌, కాసిపేట ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement