ఎస్టీపీపీలో సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీలో సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ పర్యటన

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

జైపూర్‌: సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటును గురువారం సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ జీ.రాఘవేంద్రకుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ జీఎం, వోఅండ్‌ఎం చీఫ్‌ మదన్‌మోహన్‌ ఆయనకు పూలమొక్క అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం డీఐజీ సీఐఎస్‌ఎఫ్‌ యూనిట్‌ను పరిశీలించా రు. ప్లాంటులో భద్రతపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. ప్లాంటు ను మరింత సురక్షితంగా ఉంచడానికి, తగిన భద్రతపరమైన చర్యలు తీసుకోవడానికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ చంఛల్‌ సర్కార్‌, డీజీఎం పర్సనల్‌ కిరణ్‌బాబు, ఎస్‌వోటు జీఎం శంకర్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement