‘కాళేశ్వరంపై కాంగ్రెస్‌ కుట్ర బయటపడింది’ | - | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరంపై కాంగ్రెస్‌ కుట్ర బయటపడింది’

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

మంచిర్యాలటౌన్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డిలు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుపై చేసిన కుట్ర, అసత్య ప్రచారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బయటపడ్డాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రూ.94 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పొంతన లేని ఆరోపణలు చేశారని అన్నారు. మేడిగడ్డ వద్ద కొంత భాగం కుంగిపోతే మరమ్మతు చేసేందుకు అవకాశం ఉన్నా చేయలేదని, బీఆర్‌ఎస్‌ను బదానం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించిందని అన్నారు. ఇప్పటికై నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజాపాలన దిశగా ప్రభుత్వాన్ని నడిపేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, టీబీజీఎకేఎస్‌ నాయకుడు సురేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అంకం నరేశ్‌, పెట్టెం లక్ష్మణ్‌, ఎర్రం తిరుపతి నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement