మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

● రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి ● కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

చెన్నూర్‌: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చే యూతనిస్తోందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ వెంకట స్వామి పేర్కొన్నారు. స్థానిక మైనార్టీ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అసోసియేషన్‌ మహిళా ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏర్పా టు చేసిన కుట్టు మిషన్‌ శిక్షణ శిబిరాన్ని కలెక్టర్‌ కు మార్‌ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక సాధికరత సాధించేందుకు కుట్టు శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. చెన్నూర్‌కు 400 కుట్టు మిషన్లు కేటాయించినట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు వివిధ వ్యాపారాల కోసం రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో విద్యార్థుల యూనిఫాంలు కుట్టే అవకాశం మ హిళలకు కల్పించనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, 15రోజుల పాటు ఇచ్చే కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. అనంతరం సంతోషీమాత ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీఆర్డీవో కిషన్‌, అలీప్‌ సంస్థ సంయుక్త కార్యదర్శి కవితా రాజేశ్‌, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, రాంప్‌ ప్రాజెక్ట్‌ అధికారి మహ్మద్‌ ఖాసీం, త హసీల్దార్‌ మల్లికార్జున్‌, కమిషనర్‌ మురళీకృష్ణ, చైర్‌ పర్సన్‌ పద్మ, వైస్‌ చైర్మన్‌ వినయ్‌కుమార్‌ ఉన్నారు.

భవన నిర్మాణ పనుల పరిశీలన

చెన్నూర్‌రూరల్‌: మండలంలోని సోమనపల్లి గ్రా మంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవన నిర్మాణ పనులను మంత్రి గడ్డం వివేక్‌, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి పరిశీలించారు. అంతకుముందు అక్కెపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న ఎక్కాహంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement