టీఎన్జీవోస్‌ కేంద్ర అధ్యక్షుడు జగదీశ్వర్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

టీఎన్జీవోస్‌ కేంద్ర అధ్యక్షుడు జగదీశ్వర్‌కు సన్మానం

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): టీఎన్జీవోస్‌ కేంద్ర అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎ న్నికై న మారం జగదీశ్వర్‌తోపాటు ప్రధాన కా ర్యదర్శి ఎంఎస్‌ హుస్సేనీ ముజీని మంచిర్యా ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని టీఎన్జీవోస్‌ భవన్‌లో సన్మానించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఉద్యోగుల సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో జరిగే సమవేశంలో పరిష్కారం ల భించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, టీఎన్జీవోస్‌ మాజీ జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్‌ను సన్మానించి ఆయన సేవలను గుర్తు చేశారు. అనంతరం జిల్లా కమిటీలో ఏర్పడిన ఖాళీలను కేంద్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా బొడ్డు శ్రావణ్‌, కార్యనిర్వాహక కార్యదర్శిగా మోషిన్‌ అహ్మద్‌, క్రీడా కార్యదర్శిగా కుమార్‌ కో ఆప్షన్‌ పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి వెంట కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్ల య్య, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీపతి బాపు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు సంద అశోక్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు కందుకూరి సురేశ్‌బా బు, కోశాధికారి సతీశ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు రాంకుమార్‌, తిరుపతి, నరేందర్‌, మంచిర్యా ల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్‌, కన్నెపల్లి యూనిట్‌ల బాధ్యులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement