మంచిర్యాలటౌన్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. నూతన వస్త్రాలు అందించి సన్మానించారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏకల వ్య ఆశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ప్ర ధాని నరేంద్ర మోదీ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి సత్కరించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని తానూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలి పారు. కార్మికులు ఉదయం నుంచి రాత్రి వర కు ప్రజల ఆరోగ్యం కోసం వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని, ఎలాంటి విపత్తులు వచ్చినా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు దుర్గం అశోక్, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, ఆకుల అశోక్‌వర్ధన్, జయ రామారావు, అమిరిశెట్టి రాజ్‌కుమార్, మంత్రి రామన్న, కొండ వెంకటేశ్, చిరంజీవి, తరుణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


