రా రైస్‌కు నో..! | - | Sakshi
Sakshi News home page

రా రైస్‌కు నో..!

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

● బాయిల్డ్‌ రైస్‌ ఇస్తామంటున్న మిల్లర్లు ● లేకుంటే దించుకోబోమని తీర్మానాలు ● రబీ కొనుగోళ్లపై తొలగని ప్రతిష్టంభన ● రేపటి సమావేశంలో రానున్న స్పష్టత

రబీలో బాయిల్డ్‌ బియ్యానికే అనుకూలం.. రా రైస్‌ ఇవ్వలేం.

అగ్రిమెంట్‌లో మిల్లర్లను ఏజెంట్‌గా మార్చడంపై అభ్యంతరం.

మిల్లు యజమానుల కుటుంబ సభ్యులతో ప్రమాణ పత్రం.

ఏదైనా మిల్లు బియ్యం బాకీ పడితే అన్ని మిల్లులు కలిసి ఆ బాకీ కట్టడం.

సీఎంఆర్‌ మిల్లింగ్‌, రవాణా చార్జీలు చెల్లించాలి.. టెండర్‌ ధాన్యానికి మినహాయింపు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఇంకా ప్రతిష్టంభన తొలగడం లేదు. ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు ముందుకురాకపోవడంతో మిల్లుల ట్యాగింగ్‌ కావడంలేదు. జిల్లాలో వరికోతలు కొన్నిచోట్ల ప్రారంభం కాగా, అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా రు. అయితే, కొనుగోళ్లపై మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ మధ్య ఇంకా ధాన్యం డెలివరీ అగ్రిమెంట్లు పూ ర్తికాకపోవడంతో మిల్లులకు ట్యాగింగ్‌ కావడం లే దు. రెండ్రోజుల క్రితం లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలలో కొనుగోలు కేంద్రం లాంఛనంగా ప్రారంభమైంది. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూ రు, జన్నారం (ఖానాపూర్‌) పరిఽధిలో నాలుగు ని యోజకవర్గాల పరిధిని మొత్తం నాలుగు సెక్టార్లుగా విభజించి ధాన్యం సేకరణ, రవాణా చేయాలని లక్ష్యం, ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే వరి నాట్లు తొందరగా వేసిన చోట కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు వరి ధాన్యం కల్లాల్లో ఆరబోస్తున్నారు. మరో పది రోజుల్లో వరికోతలు ఊ పందుకోనున్నాయి. అయితే, మిల్లర్లకు బాయిల్డ్‌ కో టా లక్ష్యం వస్తేనే ధాన్యం దించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా కోతకు వచ్చిన చోట ప్రైవేట్‌లో మద్దతు ధర కన్నా తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

రా రైస్‌ ఇవ్వమలేమంటూ..

వానాకాలంతో పోలిస్తే యాసంగిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో దొడ్డు, సన్నాలు ఏవైనా వడ్ల ను మరాడిస్తే నూకలు అవుతాయి. ఈ సీజన్‌ వడ్లు బాయిల్డ్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) రా రైస్‌ మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో సీఎంఆర్‌ (కస్టం మిల్డ్‌ రైస్‌) మిల్ల ర్లు రా రైస్‌ (ముడి బియ్యం) ఇస్తే ఒక్కో మిల్లుకు రూ.లక్షల్లోనే నష్టం వస్తుంది. దీంతో తాము రా రైస్‌ ఇవ్వలేమంటూ మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా టిప్‌ డ్యామేజీ అంటూ ఎఫ్‌సీఐ నిబంధన నేపథ్యంలో తాము యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఇస్తామంటూ పట్టుబడుతున్నారు. రైస్‌ మిల్లర్లు దించుకోని పక్షంలో జిల్లాలోని గోదాముల్లోనే నిల్వ చేయాలని పౌరసరఫరాల శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే, జిల్లాలో సరిపడా గోదాములు లేవు. రాష్ట్ర గిడ్డంగుల్లో కొంత మేరకు నిల్వ చేయొచ్చు. మిగతాది ప్రైవేట్‌ గోదాముల్లోనే నిల్వ చేయాలి. కొందరు మిల్లర్లు కూడా తమ మిల్లుల్లోని నిల్వ స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు.

మిల్లర్ల ఒత్తిడి నెగ్గేనా?

రాష్ట్ర స్థాయి మిల్లర్ల సంఘం కూడా ఇటీవల జరిగిన సమావేశంలో ధాన్యం దించుకోవద్దని తీర్మానించింది. అంతేకాకుండా, జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ నుంచి ధాన్యం తీసుకుంటామని ఒప్పందం కూడా చేసుకోవద్దని మిల్లర్లకు సూచించింది. దీంతో ఏ జి ల్లాలోనూ ఎక్కడా ధాన్యం తీసుకోవద్దని జిల్లా మిల్ల ర్ల సంఘం నుంచి సమాచారం పంపుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా ఒక్క మి ల్లుకు కూడా ట్యాగింగ్‌ ఇవ్వలేదు. ఈ మేరకు జిల్లా మిల్లర్ల సంఘం కూడా ధాన్యం దించుకోవద్దని త మ వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో మిల్లర్లు ట్యాగింగ్‌ చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. అయితే, ఇది రాష్ట్ర స్థాయి సమస్య కావడంతో తమ ఒత్తిడికి ప్రభుత్వం దిగివచ్చి మిల్లులకు బాయిల్డ్‌ కోటా ఇస్తుందనే ఆశాభావం మిల్లర్లలో వ్యక్తమవుతోంది.

సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం

వరి ధాన్యం సేకరణలో ఇబ్బందులు రాకుండా ఉ న్నత స్థాయిలో గురువారం పౌరసరఫరాల కమిషనర్‌తో రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రా రైస్‌కు బదులు బాయిల్డ్‌ రైస్‌కు అంగీకరిస్తే మిల్ల ర్లకు ఇబ్బంది ఉండదు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి నిర్ణయం మేరకు జిల్లాలోనూ వరి ధాన్యం కొనుగోళ్లు జరిగే అవకాశముంది. ఈ విషయంపై జిల్లా రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చిలువేరు వైకుంఠంను సంప్రదించగా.. బాయిల్డ్‌ రైస్‌ కోటా ఇస్తేనే మిల్లర్లు ధాన్యం దించుకుంటారని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం తప్పకుండా అనుమతిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మిల్లర్ల డిమాండ్లు ఇవే..

Advertisement
 
Advertisement
Advertisement