మందమర్రి మార్కెట్‌లోని పలు దుకాణాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది వారం రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్‌కు సంబంధించిన వాల్వ్‌ను కనుగొనేందుకు మార్కెట్ ఏరియాలోని పలుచోట్ల గుంతలు తవ్వారు. కానీ వారికి తవ్విన చోట వాల్వ్ కనిపించకపోవడంతో గుంతలు పూడ్చకుండా అలాగే వదిలేశారు. దీంతో దుకాణదారులతో పాటు రోడ్డు గుండా వెళ్లే ప్రజలు గుంతలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని ప్రజలు, దుకాణదారులు కోరుతున్నారు.
– మందమర్రిరూరల్


