జొన్నల దొంగలు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

జొన్నల దొంగలు అరెస్టు

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

ముధోల్‌: మండలంలోని విఠోలిలో ఈనెల 9న రైతు లక్ష్మణ్‌కు చెందిన 50 జొన్నల బస్తాలు ఎత్తుకెళ్లిన నలుగురు దొంగలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్‌నాయక్‌, ఎస్సై బిట్లా పెర్సిస్‌ తెలి పారు. కేసు దర్యాప్తులో భాగంగా తరోడా గ్రా మ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన భైంసాకు చెందిన షబాజ్‌, సాయిల్‌, అర్బాస్‌, నూమాన్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. మరోవ్యక్తి ఫారూక్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. జొన్నల బస్తాలకు సంబంధించిన డబ్బులను రికవరీ చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement