ఆర్టీవో చలానా పేరుతో, శుభాకాంక్షల పేరుతో యాప్, వాట్సాప్ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను నమ్మవద్దు. ప్రభుత్వం, పోలీస్ శాఖ తరపున ఇలాంటి ఫైళ్లు పంపించడం జరగదు. ఎవరైనా మెసేజ్ చేసి ఫైళ్లు పంపించినా ఇన్‌స్టాల్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఫైళ్లు మీ మొబైల్ ఫో న్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. బాధితులు 1930 నంబర్‌కు లేదా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు రికవరీ చేయడానికి అవకాశం ఉంది.
– ఎగ్గడ భాస్కర్, డీసీపీ, మంచిర్యాల


