మంచిర్యాలఅగ్రికల్చర్: జన గణన విధులు సమర్థవంతంగా నిర్విహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జన గణన అధికారులు, సిబ్బందికి నిర్వహించిన కార్యక్రమంలో సీపీవో, జన గణన అధికారి పాపయ్య, అదనపు జనగణన అధికారి రాజేందర్‌తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన చేయాలని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు జన గణనలో భాగంగా ఇళ్ల గణన సైతం కొనసాగుతుందని, కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయాలని అన్నారు.
పనులు పూర్తి చేయాలి
నెన్నెల: విద్యాలయాల్లోని భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కస్తూరిబా, నెన్నెల హైస్కూల్, చిత్తాపూర్ ఆశ్రమ పాఠశాలను సందర్శించి పనులను పరిశీలించారు. నెన్నెల జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్లను వారంలోగా ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ తనిఖీ చేశారు. ఎంపీడీఓ అబ్దుల్‌హై, ఎంపీఓ శ్రీనివాస్, సర్పంచ్ ఇబ్రహీం, కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు.


