● అటవీ అధికారుల తవ్వకాలను అడ్డగింత ● ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
చింతలమానెపల్లి: గంగాపూర్ శివారులో అట వీ అధికారులు శనివారం తవ్వకాలు నిర్వహించారు. ఆ స్థలంలో సాగు చేస్తున్న రైతులు తవ్వకాలను అడ్డుకోవడంతో కొంత ఉద్రి క్తత నెలకొంది. గంగాపూర్ నర్సరీ సమీపంలోఅధికారులు సర్వే నిర్వహించగా కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో కందకాల తవ్వకానికి చర్యలు తీసుకుంటుండగా పలువురు రైతులు అడ్డుకున్నారు. ఈ స్థలం తమకు ప్రభుత్వం కేటా యించిందని, పనులను నిలిపివేయాలని కోరారు. ఈ భూమి అటవీశాఖదని సర్వేలో తేలినట్లుగా అధికారులు తెలుపగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏండ్లకు పైగా భూమిని సాగు చేస్తున్నామని భూమి లో కందకాలు తవ్వడంతో తాము నష్టపోతా మని వాపోయారు. ఈవిషయమై ఎఫ్‌ఆర్వో సుభాష్ మాట్లాడుతూ ఈ భూమి అటవీ ప్రాంతంలో ఉందని అటవీ పరిధి మేరకు పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతంలో త్వరలో ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తామన్నారు. అటవీ అభివృధ్ధి పనుల్లో భాగంగా కందకాలు తవ్వుతున్నట్లు వివరించారు.


