నార్నూర్: జొన్న పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మాడవి ప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌లో శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండలంలోని మాలేపూర్ గ్రామానికి చెందిన మేర్ట్‌కర్ బాలాజీ తన పంటలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం రాత్రి రెవెన్యూ అధికారులతో కలిసి దాడి చేసి 24 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.2.40 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక బృందంతో గాలించి అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్సై శ్రీసాయి, సిబ్బందిని సీఐ అభినందించారు.


