సంతానం లేని వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. చిన్న పిల్లలను అమ్మిన వారిపై, కొన్నవారిపై కేసు నమోదు చేస్తాం. దళారులను నమ్మి పోసవద్దు.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల
దళారులను నమ్మి మోసపోవద్దు
దత్తత తీసుకునే వారు దళారులను నమ్మి మోసపోవద్దు. పిల్లలు లేని వారు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. సీడబ్ల్యూసీ అధికారులను కలిస్తే వివరాలు అందిస్తారు. సీఏఆర్‌ఏ కింద దత్తత ఏజెన్సీ కేంద్రాలు పనిచేస్తాయి. దరఖాస్తు చేసుకుంటే చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం ఉంది.
– రౌఫ్‌ఖాన్, జిల్లా శిశు సంక్షేమ అధికారి


