కై లాస్‌నగర్: సబ్సిడీపై అందించే గృహావసర ఎల్‌పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో సివిల్ సప్‌లై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం పట్టణంలోని టీచర్స్‌కాలనీలోని రోడ్ నంబర్ 16లో గల ఓ ఇంటిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి బాదంమిల్క్, ఐస్‌క్రీమ్, వివిధ రకాల స్వీట్ల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. వాటి తయారీకి కమర్షియల్ సిలిండర్లకు బదులుగా వివిధ ఆయిల్ కంపెనీల గృహావసర సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మూడు ఎల్‌పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకుని వాటిని వినియోగిస్తున్న వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీపై అందించే గృహావసర సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించడం చట్టరీత్యా నేరమని డీటీ మహేశ్ తెలిపారు. తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


