ప్రకృతికి ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతికి ప్రోత్సాహం

Mar 21 2026 5:15 AM | Updated on Mar 21 2026 5:15 AM

● జిల్లాలో 1875 ఎకరాల్లో సాగు ● ఎంపిక చేసిన రైతులకు సలహాలు, సూచనలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రసాయనిక ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతిని నేల, జీవ వైవిధ్యం, వాతావరణం, ఆహార పంటలు విషతుల్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ప్రకృతి వ్యవసాయ వైపు మళ్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఇందులో భాగంగా జాతీయ సేంద్రియ వ్యవసాయ పథకం ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక, మత్స్యశాఖల సమన్వయంతో సేంద్రియ వ్యవసాయం 2025–26, 27 సంవత్సరాలకు గాను ఎంపిక చేసిన రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి సంవత్సరానికి పెట్టుబడి కింద రూ.4వేల చొప్పున అందిస్తారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సాగు వ్యయాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే ముఖ్య ఉద్దేశంతో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ పథకం కింద జిల్లాలో 1875 మంది రైతులను ఎంపిక చేశారు. ఐడీ కార్డు, భూముల భూసార పరీక్షలు చేయించి వాటి ఫలితాల కార్డు, సలహాల బుక్‌, బ్యాగ్‌, క్యాప్‌, తదితర వివరాలతో కూడిన కిట్లు అందజేశారు.

జిల్లాలో 15 క్లస్టర్లు

ప్రకృతి వ్యవసాయానికి జిల్లాలో 15 క్లస్టర్లు ఏర్పా టు చేసి.. ఒక్కో క్లస్టర్‌లో 125మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కొక్కరు ఒక్కో ఎకరం సాగు చేసే లా సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను వివరించి ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో క్లస్టర్‌లోని రైతులకు సలహాలు అందించేందుకు ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన ప్రగతిశీల మహిళా రైతులు(కృషి సఖీస్‌) వాలంటీర్లుగా 30మందిని నియమించారు. కమ్యూనిటీ బేస్‌గా పని చేసేందుకు వేతన ఇతరత్రా కలిపి రూ.5వేలతోపాటు ప్రత్యేక మొబైల్‌ అందజేసి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల ద్వారా 16 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. వర్షాకాలానికి ముందే సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు సేంద్రియ వ్యవసాయ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనే సూచనలు, సలహాలు, పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. భూసార పరీక్షలకు అనుగుణంగా నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు, వాతావరణ మా ర్పులకు అనుగుణంగా పంటలు విత్తుకోవడం, ప్ర కృతిపరంగా లభించే ఎరువులు ఆవుపేడ, ఆవుమూత్రం, బెల్లం, పప్పుల పిండి, రైజోస్పియర్‌ మట్టి, వేప, కానుగ, బొప్పాయి, జామ ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి సహాజసిద్ధంగా లభించే వాటితో తయారు చేసే వర్మీ కంపోస్టులు బీజామృతం, జీవామృతం, ఘనామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నాస్త్రం, దశపర్ణికషాయం వంటి ద్రా వణాలు, కషాయాల సేంద్రియ ఎరువులను విని యోగిస్తూ ఆనాటి సనాతన పద్ధతిలో పంటల సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు.

మొదటి విడతలో 1875 ఎకరాలు..

జిల్లాలో 3.60లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 1.58లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. గత కొంతకాలంగా పత్తి, వరి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ పంటలతోపాటు కూరగాయల పంటల దిగుబడి కోసం రైతులు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తుండడంతో పెట్టుబడి పెరిగిపోతోంది. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వందలాది మెట్రిక్‌ టన్నుల ఎరువులు, వందల లీటర్ల చీడపీడల పురుగు మందులు వినియోగిస్తున్నారు. వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం, నేల నిస్సారం అవుతోంది. రసాయనిక మందులు పిచికారీ చేస్తున్న రైతులతోపాటు వినియోగిస్తున్న ప్రజలూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో రసాయనిక ఎరువుల వినియోగం విడతల వారీగా తగ్గించేందుకు ప్రభుత్వం సహజ సిద్ధ ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తోంది.

జిల్లాలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement