మంచిర్యాలఅగ్రికల్చర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోయ్యాల హేమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, కార్పొరేటర్ కాస్తూరి నాగరాజు, నాయకులు వెంకటేశ్వర్‌రావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.


