మంచిర్యాలక్రైం: పిచ్చుకల సంరక్షణ అందరి బాధ్యత అని మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కలెక్టరేట్ రోడ్డులోని మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పౌరుడు పర్యవరాణానికి నష్టం కలిగించకుండా జీవన విధానం అలవర్చుకోవాలని, ప్రకృతికి మి త్రులుగా మారాలని తెలిపారు. వేసవిలో పిచ్చుకల సంరక్షణ కోసం ఇళ్ల గోడలు, చెట్లపై, వీలైన ప్రదేశాల్లో మట్టి పాత్రల్లో నీళ్లు, గింజలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం వెదురు, కర్ర, గడ్డి, మట్టితో చేసి న పిచ్చుక గూళ్లు, మట్టి పాత్రలు, జొన్న గొ లుసుల ధాన్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్, న్యాయవాది నటేశ్వర్, పశు వైద్యాధికారి గుల్లపల్లి శంకర్, వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్‌కుమార్, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కిష్టయ్య, ప్రకృతి ప్రేమికుడు అక్కల చంద్రమౌళి, ప్రకృతి మిత్ర సంస్థ సభ్యులు పాల్గొన్నారు.


