● 229మంది గైర్హాజరు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 23 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు తొలి రోజు నిర్వహించిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 6,688 మంది విద్యార్థులకు గాను 6,459 మంది హాజరయ్యారు. 229మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 5,776 మందికి గాను 5,603 మంది హాజరు కాగా 173మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 912మందికి గాను 856 మంది పరీక్ష రాయగా.. 56మంది రాలేదు. మంచిర్యాలలోని అల్ఫోర్స్, ఎస్సారార్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేశారు. ఇబ్బందులపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థుల కోసం యాజమాన్యాలు బస్సులు ఏర్పాటు చేయగా.. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు పరీక్ష సమయాల్లో ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడిపించింది. నిమిషం నిబంధన సడలింపుతో మూడు నాలుగు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ పరీక్షకు అనుమతించారు. జిల్లా కేంద్రంలోని ఐదు కేంద్రాలను డీఐఈవో అంజయ్య పరిశీలించారు. గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
● 229మంది గైర్హాజరు


