సమస్యలు పరిష్కరించాలని ధర్నా
పాతమంచిర్యాల: కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏవో రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజుయాదవ్, సింగరేణి పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కిషన్‌రెడ్డి, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ లగిశెట్టి కమలాకర్ పాల్గొన్నారు.


