రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలి
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీల్లోనూ క్రీడాకారులు ప్రతిభ కనబర్చాలని ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరి ఆడే రామేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం కబడ్డీ, రెజ్లింగ్ క్రీడాంశాల్లో జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోనల్ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. జోనల్ స్థాయి అండర్–17 బాలుర కబడ్డీ ఎంపిక పోటీల్లో ఆసిఫాబాద్ జిల్లా ప్రథమస్థానం, నిర్మల్ ద్వితీయ స్థానంలో నిలిచాయన్నారు.అండర్–14 బాలబాలికల రెజ్లింగ్ ఎంపిక పోటీలు నిర్వహించామని, అండర్–17 విభాగంలో బాలబాలికలకు సైతం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, రెజ్లింగ్ శిక్షకుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.


