మందమర్రిలో సింగరేణి స్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

మందమర్రిలో సింగరేణి స్థాయి పోటీలు

Nov 5 2025 8:13 AM | Updated on Nov 5 2025 8:13 AM

మందమర్రిలో సింగరేణి స్థాయి పోటీలు

మందమర్రిలో సింగరేణి స్థాయి పోటీలు

మందమర్రిరూరల్‌: మందమర్రి ఏరియాలోని సీఈఆర్‌ క్లబ్‌లో డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. జీఎం రాధాకృష్ణ స్పోర్ట్స్‌ జెండా ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందమర్రి ఏరియాలో సింగరేణి స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించడం హర్షనీయమన్నారు. పోటీల్లో గెలిచిన క్రీడాకారులు కోలిండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి సంస్థకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కీర్తనలు, భజనలు, గజల్స్‌, సోలో సాంగ్స్‌, లైట్‌ సాంగ్స్‌, బుల్‌బుల్‌ సితారా, కీబోర్డ్‌ సాంగ్స్‌, తబలా, కూచిపూడి, భరత నాట్యం పోటీలు నిర్వహించగా సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌, డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ గౌరవ కార్యదర్శి కార్తీక్‌, ఏరియా కోఆర్డినేటర్‌ శివకృష్ణ, క్రీడల సూపర్‌వైజర్‌ జాన్‌వెస్లీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement