చెట్లు నరికిన కేసులో ఒకరి రిమాండ్
ఉట్నూర్‌రూరల్: అటవీ ప్రాంతంలో చెట్లు నరికిన ఒకరిపై మంగళవారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బీర్సాయిపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుమ్మరికుంటకు చెందిన మడావి మానిక్‌రావు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్లు నరకడంతో అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తె లిపారు. డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో సీతారాం, ఎఫ్‌బీవోలు మాయాదేవి, మహిపాల్, కోసేరావు, బలవంత్‌రావు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


