పిప్రివాసి మాల్టాలో అనుమానాస్పద మృతి
బజార్‌హత్నూర్: మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన రామగిరి సాయికుమార్(28) మాల్టా దేశంలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్‌కు చెందిన రాజు పిప్రి గ్రామంలో ఉన్న తన సమీప బంధువులు రామగిరి సాయికుమార్, అనిల్ మాల్టా వస్తే లక్షల్లో జీతాలు ఉన్నాయని చెప్పడంతో రూ.6 లక్షల చొప్పున సెర్భియా జాతి ఏజెంట్‌కు చెల్లించారు. 3 నెలల టూరిస్ట్ వీసా పంపగా అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి పని చూపించలేదు. అక్టోబర్ 30న సాయికుమార్ అపార్టుమెంట్ పైనుంచి కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అనిల్ మృతుని కుటుంబ సభ్యులకు సమాచా రం అందించాడు. పిప్రి గ్రామానికి చెందిన ప్ర వాసీ మిత్ర లేబర్ యూనియన్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ కొమ్ము శశిమాల తెలంగాణ స్టేట్ ఎన్‌ఆర్ ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్లకు విషయం చెప్పడంతో మాల్టాలోని భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా బాధితుని వివరాలు పంపించారు. శవ పరీక్షల అనంతరం స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
చికిత్స పొందుతూ మెకానిక్..
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రాకాలనీకి చెందిన బైక్ మెకానిక్ ఎర్రోజుల సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. మృతుడు గతనెల 30న ఇంటివద్ద బాత్‌రూంకు వెళ్లగా బీపీ పెరగడంతో కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎసై తెలిపారు.
అడవిపందుల దాడిలో పంట ధ్వంసం
వేమనపల్లి: మండలంలోని మంగనపల్లిలో గంగిరెడ్డి తిరుపతికి చెందిన వరి పొలంలో అడవి పందులు దాడులు చేసి పంటను ధ్వంసం చేశాయి. కోతకు వచ్చిన రెండెకరాల వరిపైరును తొక్కి నేల పాలు చేశాయని బాధితుడు వాపోయాడు. డిప్యూటీ అటవీ రేంజర్ రూపేష్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
పిప్రివాసి మాల్టాలో అనుమానాస్పద మృతి


