
‘మహిళలను అగౌరవ పరిస్తే ఊరుకోం’
మంచిర్యాలటౌన్: మహిళలను అగౌరవ పరిచే విధంగా బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత, నాయకురాలు అర్కల హేమలత మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు బీఆర్‌ఎస్ నాయకులకు మాట్లాడే విధానం, మహిళల పట్ల మర్యాదను నేర్పాలని హితవు పలికారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశామని చెప్పుకునే ఆయన భావితరాలకు ఉపయోగపడేలా ఏ పథకం తీసుకువచ్చారో చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యేగా ప్రేమ్‌సాగర్‌రావు మాతాశిశు ఆసుపత్రిని ప్రారంభించారని, మహాప్రస్థానం నిర్మాణం, రాళ్లవాగు కరకట్ట, ఇండస్ట్రియల్ పార్కు వంటివి తీసుకొచ్చారని తెలిపారు.