
అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని రాస్తారోకో
జన్నారం: టైగర్‌జోన్ పేరిట విధించిన అటవీ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ పగటి పూట భారీ వాహనాల రాకపోకలను నిషేధించడం వల్ల జన్నారం అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా తగ్గిపోయాయని అన్నారు. ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతం మరింత వెనుకబడే ప్రమాదం ఉందని తెలిపారు. అటవీ ఆంక్షలను ఎత్తివేసే వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు అశోక్, రాకమ్మ, లక్ష్మణ్, విజయ, తదితరులు పాల్గొన్నారు.