
‘ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం’
పాతమంచిర్యాల: ఎస్సీ వర్గీకరణలోని లోపా ల వల్ల మాల, మాల ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుందని, లోపాలను సవరించి న్యాయం చేయాలని మాల, మాల ఉపకులాల జేఎసీ జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వర్గీకరణ అమలు కాకముందు వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగుల రోస్టర్ పా యింట్ల విషయంలో సరైన నియమ నిబంధనలు పాటించడం లేదన్నారు. మాల ఉద్యోగుల సంఘం నాయకులు దాసరి వెంకటరమణ, కూన రవికుమార్, వేముల కృష్ణ, కాసర్ల యోహన్, వేల్పుల నరేష్, తొగరు కార్తీక్, గోపాల్, రేవెల్లి సతీష్ పాల్గొన్నారు.