
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి
రామకృష్ణాపూర్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్‌రాజ్ సూచించారు. మందమర్రి పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మానస, జాన్వీ, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించాలి
జన్నారం: వైద్యసిబ్బంది గ్రామాల్లో పర్యటించి వ్యాధులపై తెలుసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డెంగీ, వైరల్ ఫీవర్‌లపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నారు. గ్రామాల్లో అనుమానితుల రక్త నమూనాలు సేకరించాలని తెలిపారు. సమావేశంలో వైద్యులు ఉమాశ్రీ, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.