
టీచర్ల ముఖ గుర్తింపు హాజరు
మంచిర్యాలఅర్బన్/దండేపల్లి: జిల్లాలోని సర్కారు బడుల్లో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అటెండెన్స్(ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. పారదర్శకత కోసం విద్యాశాఖ ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ ప్రవేశపెట్టింది. మొదటి రోజు శుక్రవారం ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణ నుంచి అటెండెన్స్ వివరాలు అప్‌లోడ్ చేయడం, హాజరు నమోదులో తలమునకలయ్యారు. కొన్ని పాఠశాలల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. 738 పాఠశాలల్లో 3209 మంది టీచర్లు న్నారు. ఇందులో 2020 మంది మాత్ర మే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. యాప్‌లో వివరాలు నమోదు తర్వాత 1934 మంది టీచర్లు ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏతో హాజరు నమోదయ్యారు.