
ప్రజలకు చేరువలో వైద్యసేవలు
జైపూర్: ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ప్రజలకు చేరువలో వైద్యసేవలు అందిస్తున్నామని జిల్లా వైద్యాధికారి హరీశ్‌రాజ్ తెలిపారు. మండలంలోని కుందారం ఆరోగ్యకేంద్రం పరిధి ఇందారం ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. మాతాశిశు సంక్షరణ నమోదు రిజిష్టర్లు, టీకాల రిజిష్టర్ల ఈటీడీ లిస్టు, హైరిస్క్ గర్భిణుల వివరాలు, గ్రామంలో తాగునీటి బోర్‌వెల్స్, అసంక్రమణ వ్యాధులు, పరీక్షలు, రోగుల వివరాలు నమోదు చేయాలని తెలిపారు. 102అంబులెన్స్‌లో గర్భిణులను ఆస్పత్రులకు తరలించి సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.