
చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి
మంచిర్యాలటౌన్: అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికి త్స అందించడంతోపా టు తల్లిదండ్రులకు తెలియజేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏసీసీ–3 అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. అంగన్‌వాడీ చిన్నారులతోపాటు స్థానిక ప్రజలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులు, లబ్ధిదారులకు అందిస్తున్న పోషకాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ ఎన్.పద్మ, ఏఎన్‌ఎం నాగలక్ష్మి పాల్గొన్నారు.