
కుల వివక్ష లేకుండా కృషి
కాసిపేట: సమాజంలో నేటికీ కోన్నిచోట్ల కుల వివక్ష ఉండడం బాధాకరమని, అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ కృషి చేస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం మండలంలోని దేవాపూర్‌లో తహసీల్దార్ భోజన్న ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులు, ఆదివాసీ, దళిత సంఘాల నాయకులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ గ్రామాల్లో అభివృద్ధి చేయడం లేదని తెలిపారు. ఆదివాసీలు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గప్రసాద్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ టీం సభ్యుడు వెంకటేశం, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎస్సై గంగారాం, ఎంపీవో షేక్ సబ్ధర్ అలీ, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.