సేవ్‌ ఆదివాసీ పేరుపై ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

సేవ్‌ ఆదివాసీ పేరుపై ఉద్యమం

Jul 28 2025 12:12 PM | Updated on Jul 28 2025 12:12 PM

సేవ్‌ ఆదివాసీ పేరుపై ఉద్యమం

సేవ్‌ ఆదివాసీ పేరుపై ఉద్యమం

ఆదిలాబాద్‌రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ఆదివాసీలపై దాడులు చేయడంతోపా టు అటవీ ప్రాంతం నుంచి దూరం చేసేందుకు కుట్రలను తిప్పికొట్టేందుకు సేవ్‌ ఆదివాసీ పేరుపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపడుతానని రాజ్‌గోండ్‌ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీయూ భవనంలో ఆదివారం ఆయన రాజ్‌గోండ్‌ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఆదివా సీలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు త రలివచ్చారు. ముందుగా జిల్లా కేంద్రంలోని కుము రంభీం చౌక్‌లో భీం విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా ఎస్టీయూ భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలకు ఏం చేశారని తనను జిల్లాలోని కొందరు ప్రశ్నించడంతోపాటు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోయినా ఫర్వాలేదని ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కుకు టికెట్‌ ఇవ్వాలని అధిష్టానాన్ని ఒప్పించానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీలో ఉన్నప్పటికీ ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు పటేల్‌కు ఓటేయాలని ఆదివాసీలకు పిలుపునిచ్చానని తెలిపారు. చిల్లరవ్యక్తుల మా దిరిగా తాను కాదనే విషయాన్ని గ్రహించాలన్నారు. కేంద్రప్రభుత్వం జీవో నం.49ను రద్దు చేసేవరకు పోరాడతానన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు ఢిల్లీలో టెంట్‌ వేసుకుని ధర్నా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆదివాసీల సమస్యలను ఇటీవల సీఎం దృష్టికి తీసుళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఆదివాసీలు ఏకతాటిపై ఉండాలి

– ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

లంబాడాలు, గిరిజనేతరులకు దూరమయ్యామని, ఇప్పటికై నా ఆదివాసీలంతా ఏకతాటిపై ఉండాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌ పిలుపుని చ్చారు. జిల్లా కేంద్రంలో జరిగిన రాజ్‌గోండ్‌ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణాస్వీకరానికి హాజ రై మాట్లాడారు. ఆదివాసీల్లో 9 తెగలు విచ్ఛినం చే యడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఆదివా సీ ప్రజాప్రతినిధులు వారి సమస్యల పరిష్కారం కోసం, వాస్తవాలు మాట్లాడితే వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. నాయకులు అర్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆత్రం సుగుణక్క, సుధాకర్‌, ఆనంద్‌రావ్‌, రాంకిషన్‌, తానాజీ, డీసీసీబీ చైర్మన్‌ భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ నర్సయ్య, శ్రీనివాస రెడ్డి, గజేందర్‌, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌గోండ్‌ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement