
‘పేదల ఆరోగ్యంపై వివక్ష ఎందుకు’
ఆదిలాబాద్టౌన్(జైనథ్): పేదల ఆరోగ్యంపై ఈ ప్ర భుత్వాలకు వివక్ష ఎందుకని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా ఎనిమిదో రో జు సోమవారం జైనథ్ మండల కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనమని చెబుతూనే దొడ్డు బియ్యం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. కోడి గుడ్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇదేనా విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనమని ప్ర శ్నించారు. మరుగుదొడ్ల నిర్మాణం నాణ్యతగా లేద ని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. మందులు ఉన్నాయా.. లేవా.. అనే విషయాలను రోగుల ద్వారా తెలుసుకున్నారు. మా భూమి రథయాత్ర ద్వారా విద్య, వై ద్యం, ఉపాధి రంగాలన్నింటినీ పరిశీలించి వాటి మెరుగుదల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో పోరాడుతామని వివరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్, ఇతర నాయకులున్నారు.