● ‘రాజీవ్ యువ వికాసం’కు నేడే ఆఖరు ● మూడు రోజులుగా పనిచ
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి క ల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించినప్పటికీ, సాంకేతిక సమస్యలతో దరఖాస్తు ప్రక్రియలో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. అయినా మూడు రోజులుగా సైట్ పని చేయడం లేదు. దీంతో గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు.
దరఖాస్తు ప్రక్రియ..
రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ నెల 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే, వె బ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, సర్వర్ లోడ్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2 నుంచి ఆఫ్‌లైన్ ద్వారా మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. గడువు సమీపిస్తున్నా సమస్యలు కొనసాగడంతో, ప్రభుత్వం గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది.
ఆఫ్‌లైన్‌తో ఊరట
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో వెబ్‌సైట్ తెరవకపోవడం, దరఖాస్తుల సబ్‌మిషన్‌లో ఆటంకాలు వంటి సమస్యలతో యువత ఇబ్బందులు ఎదుర్కొంది. మూడు రోజులుగా వెబ్‌సైట్ సరిగా పనిచేయకపోవడంపై నిరుద్యోగులు ఫిర్యాదు చేశారు. రెండో శని వారం, ఆదివారం, అంబేద్కర్ జయంతి సెలవులతో మూడు రోజులు కార్యాలయాలు మూ తపడినప్పటికీ, సెలవు రోజుల్లోనూ దరఖాస్తుల స్వీకరణ కు సిబ్బందిని నియమించడంతో వేలాది మంది సద్వినియోగం చేసుకున్నారు. ఆఫ్‌లైన్ విధానంతో మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచగా, సిబ్బంది వివరాలను నమోదు చేసేందుకు సహకరిస్తున్నారు.
గడువు పెంచాలని వినతి..
ఆన్‌లైన్ సమస్యలు కొనసాగుతుండడం, వరుస సెలవుల నేపథ్యంలో గడువును మరోసారి పొడిగించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆఫ్‌లైన్ విధానం లేకపోతే దరఖాస్తు ప్రక్రియలో మరింత గందరగోళం నెలకొనేదని, ఈ విధానం యువతకు ఊరటనిచ్చిందని అభిప్రాయపడుతున్నారు. చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో, అధికారులు కూడా గడువు పొడిగింపు అవసరాన్ని అంగీకరిస్తున్నారు.
● ‘రాజీవ్ యువ వికాసం’కు నేడే ఆఖరు ● మూడు రోజులుగా పనిచ


