సింగరేణిలో ఆర్కే 6 గనికి ప్రత్యేక స్థానం
శ్రీరాంపూర్: సింగరేణిలో ఆర్కే 6 గనికి ప్రత్యేక స్థానం ఉందని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ అన్నారు. ఈ గని ఏర్పాటు చేసి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం గనిపై వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీఎం మాట్లాడుతూ వేలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేసి బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగస్వామ్యం అయ్యారన్నారు. ఎస్‌డీఎల్ సెక్షన్‌లో అత్యధిక ఉత్పత్తిని సాధించి కంపెనీలోనే రికార్డు నమోదు చేసుకుందన్నారు. బొగ్గు నిల్వలు అడుగంటడంతో మరో రెండు నెలల్లో గనిని మూసివేస్తున్నామన్నారు. ఏరియా ఎస్‌ఓటు జీఎం సత్యనారాయణ, గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, గని మేనేజర్ ఈ.తిరుపతి, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, బ్రాంచి సెక్రెటరీ ఎస్కే బాజీసైదా, గని రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.


